ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వం దేశానికి చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రగతి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ఈ దేశాన్ని చెత్త ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం పరిపాలిస్తున్నదని ధ్వజమెత్తారు.
అబద్ధాల్లో బతుకుతూ, మతపిచ్చి లేపుతుందని మండిపడ్డారు. ‘ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దేశ సమగ్రతను నాశనం చేస్తున్నది. నేను భారత ప్రభుత్వంపై ఆరోపణ చేస్తున్నాను. అఫ్గానిస్థాన్‌లో పెట్టుబడి పెట్టమంటే ఎవరైనా అక్కడ పెట్టుబడి పెడుతారా? అక్కడ ఎందుకు పెట్టుబడులు పెట్టడంలేదు? అక్కడ పెట్టుబడులకు, జీవితానికి గ్యారంటీ లేదు.
తెలంగాణ రాష్ర్టానికి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చినయి. నిన్ననే 1500 కోట్లతో పెట్టుబడి పెట్టడానికి ఓ కంపెనీ ముందుకొచ్చింది. దానితో రెండు వేల మందికి ఉద్యోగాలు వస్తయి