తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. వీఐపీల విడిది కోసం నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రెసిడెన్షియల్ సూట్‌ను అత్యాధునిక సదుపాయాలతో 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.
ఆలయాన్ని తిలకించేందుకు ప్రత్యేకమైన వ్యూపాయింట్‌ను ఏర్పాటు చేశారు. చిన్న కొండపై 14 విల్లాలు, ఒక మెయిన్ సూట్‌ను నిర్మించారు. 13.25 ఎకరాల్లో సూట్ల నిర్మాణం జరిగింది.ప్రెసిడెన్షియల్ సూట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే గొంగిడి సునీత తదితరులు పాల్గొన్నారు.
అనంతరం భువనగిరిలో కొత్తగా నిర్మించిన అధునాతన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3:15 గంటలకు టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకొని నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 4 గంటలకు రాయగిరిలోని బహిరంగ సభలో పాల్గొంటారు.