కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ అమృతాలయ సప్తమ వార్షిక బ్రహ్మోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అమృతాలయ సప్తమ వార్షిక బ్రహ్మోత్సవంలో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు. స్వామి వారి చల్లని చూపు ప్రజలపై తప్పక ఉంటుందని పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు, పక్కాల దుర్గారావు, నర్సింహా రెడ్డి, యాదగిరి, చంద్రమౌళి, లింగం తదితరులు పాల్గొన్నారు.