Home / INTERNATIONAL / రష్యా ఆ ఆస్త్రం ప్రయోగిస్తే ఉక్రెయిన్ మరో నాగసాకి అవుతుందా..?.. దానికంత పవర్ ఉందా..?

రష్యా ఆ ఆస్త్రం ప్రయోగిస్తే ఉక్రెయిన్ మరో నాగసాకి అవుతుందా..?.. దానికంత పవర్ ఉందా..?

నాటోను బూచిగా చూపించి రష్యా దేశం ఉక్రెయిన్ లాంటి చిన్న దేశంపై గత నాలుగురోజులుగా భారీమారణ హోమం సృష్టిస్తున్న సంగతి విదితమే. అయిన కానీ ఉక్రెయిన్ తమ స్థాయికి మించి రష్యా దళాలను ఎదుర్కుంటూ దాడులను తిప్పికొడుతుంది. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్ పై అణ్వాయుధాలతో దాడులు చేయడానికి సిద్ధంగా ఉండాలని తమ సేనను ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలో ఉక్రెయిన్ ను హస్తగతం చేసుకోవడానికి ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ప్రయోగిస్తారని ఆ వార్తల సారాంశం . ఇదే కనుక జరిగితే భూమిపై ఉక్రెయిన్ మరో హిరోషిమా,నాగసాకి అవుతుందని యుద్ధ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా 2007కంటే ముందు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ పేరుతో శక్తువంతమైన బాంబ్ ను తయారుచేసింది.

ఈబాంబుకు పోటిగా రష్యా ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ పేరుతో దానికంటే అతి శక్తివంతమైన బాంబును తయారు చేసింది. అమెరికా తయారు చేసిన మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ (MOAB)కంటే రష్యా తయారు చేసిన ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ (FOAB)చాలా పవర్ ఫుల్. ఇది 44టన్నుల టీఎన్టీ శక్తిని ఉత్పత్తి చేయగలదు.దీనిని యుద్ధ విమానాల ద్వారా ఆకాశ మార్గంలో వదులుతారు. భూమిని తాకేలోపు గాలిలోని బాంబు పేలుతుంది.పేలుళ్ళు జరిగిన అతి కొద్ది క్షణాల్లోనే వేల డీగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత విడుదలవుతుంది. అత్యంత ప్రమాదకరమైన రేడియో ధార్మికత బయటకు వస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat