ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నిన్న గురువారం సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున కోర్టుకు హజరు కావాలని ఆదేశించింది.
2014సార్వత్రిక ఎన్నికల సమయంలో హుజూర్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,నాగిరెడ్డిపై ఎన్నికల సంఘ అధికారులు చేసిన పిర్యాదు మేరకు కేసు నమోదైంది.
ఈ కేసును విచారించిన కోర్టు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే అభియోగాన్ని పరిశీలించి సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి లాంటి నేతకు ఎంపీ,ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారి.