ఏపీ మంత్రివర్గంలో 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. కేబినెట్ భేటీ అనంతరం తమ రాజీనామాలను సీఎం జగన్‌కు అందజేశారు. కేబినెట్ సమావేశంలో 36 అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. సంగం బ్యారేజ్‌కి దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి పేరు, మిల్లెట్ మిషన్ పాలసీ, డిగ్రీ కాలేజీల్లో 574 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ వంటి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రాజీనామాలను ఈ రాత్రికే గవర్నర్ ఆమోదించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రక్రియను సాధారణ పరిపాలన అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులంతా ఎలాంటి అసంతృప్తికి గురికాకుండా సాధారణంగానే బయటకు వచ్చారు. పలువురు మంత్రులు మీడియాతో మాట్లాడుతూ సీఎం ముందుగానే రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని చెప్పిన నేపథ్యంలో రాజీనామా చేయడం ఇబ్బందిగా ఏమీ లేదని.. మిగిలిన సమయాన్ని పూర్తిస్థాయిలో పార్టీ కోసం కేటాయిస్తామని చెప్పారు.