కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వంపై మహరాష్ట్ర అధికార పార్టీ అయిన శివసేనకి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. మహరాష్ట్రలోని ముంబైను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు బీజేపీకి చెందిన కొంతమంది నేతలు కొందరు వ్యూహరచన చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కీరత్ సోమయ్య నాయకత్వంలో ఈ కుట్ర జరుగుతుందని విమర్శించారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ప్రెజెంటేషన్ ఇచ్చారని చెప్పారు. మరాఠీ భాష మాట్లాడే వారి సంఖ్య ముంబైలో తగ్గిందనే కారణంతో ఇలాంటి కుటిల రాజకీయాలు చేస్తుందని విమర్శించారు.