రేవంత్‌రెడ్డిలా లాలూచీ పనులను సీఎం కేసీఆర్ చేయలేదని.. తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకొని వెళ్లారని ఎర్రబెల్లి చెప్పారు. ఉద్యమ సమయంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తెలంగాణ కోసం పోరాడితే రేవంత్ మాత్రం చంద్రబాబుకు ఏజెంట్‌లా పనిచేశారని తీవ్రస్థాయిలో మంత్రి మండిపడ్డారు. తెలంగాణను అభివృద్ధి చేసిన మహానేత కేసీఆర్ అని.. మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు నీరు అందించిన ఘనత ఆయనదని చెప్పారు. కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ తరహా పథకాలు అమలవుతున్నాయా? అని ఎర్రబెల్లి సూటిగా ప్రశ్నించారు.
