ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల పాలనలో మహిళలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మహిళల ఉన్నత విద్యపై పలు కండిషన్లు పెట్టిన తాలిబన్లు.. తాజాగా మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీచేయడాన్ని నిలిపివేశారు. కాబూల్, ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఈ అంశమై ఆదేశాలు జారీ అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. డ్రైవింగ్ టీచర్లకు కూడా ప్రభుత్వ మార్గదర్శకాలు అందినట్లు పేర్కొంది.
