తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,000 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోకి 400-500 బస్సులు రానున్నాయి.
బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ త్వరలో టెండర్లు ఫైనల్ చేయనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో తిరుగుతున్న బస్సులతో RTCకి రోజుకు రూ.3.50 కోట్ల ఆదాయం వస్తుండగా.. దాన్ని రూ.4 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.