కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రూ. 2,500 కోట్లు ఇస్తే వస్తుందటని.. ఈ మాట కర్ణాటక బీజేపీ ఎంపీనే చెప్తున్నాడని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నాయని మంత్రి విమర్శించారు. ఒక పార్టీలో ఓటుకు నోటు.. మరో పార్టీలో సీఎం సీటుకు నోటు పంచాయితీ ఉందని ఎద్దేవా చేశారు.
జయశంకర్ భూపాలపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాన చేసిన అనంతరం నిర్వహించిన సభలో హరీశ్‌రావు మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా ఉన్న వ్యక్తి ఓటుకు నోటు కేసులో ముద్దాయి అని.. ఇలాంటి పార్టీలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? అని మంత్రి నిలదీశారు. టీఆర్‌ఎస్‌కు ప్రజలే హైకమాండ్ అని.. వారు ఏది చెప్తే అదే చేసే పార్టీ అని హరీశ్‌రావు అన్నారు.