Home / CRIME / కన్న కొడుకునే పెండ్లి చేసుకున్న మహిళ..

కన్న కొడుకునే పెండ్లి చేసుకున్న మహిళ..

మానవ సంబంధాలు క్రమంగా మంటగలసి పోతున్నాయి. కన్న కూతురిపై తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడనే వార్తలు తరచూ చదువుతూనే ఉన్నాం. తాజాగా తన పేగు తెంచుకు పుట్టిన కొడుకునే ఓ మహిళ పెండ్లి చేసుకున్న విచిత్రమైన సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్నది.

ఉత్తరాఖండ్‌లోని బాజ్‌పూర్‌నకు చెందిన బబ్లీ, ఇంద్రరామ్‌ భార్యాభర్తలు. ఇంద్రరామ్‌ ఆమెకు రెండో భర్త. వారిద్దరు 11 ఏండ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారిద్దరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, బబ్లీకి మొదటి భర్త వల్ల ఇద్దరు కుమారులు కలిగారు. అనంతరం అతడు వదిలేయడంతో ఇంద్రరామ్‌ను రెండో వివాహం చేసుకున్నది.

ఇంద్రరామ్‌, బబ్లీ సంసారం సజావుగా సాగుతున్న క్రమంలో మొదటి భర్తతో కలిగిన పెద్ద కొడుకు వారి ఇంటికి రావడం మొదలు పెట్టాడు. గతకొంత కాలంగా అతడు తన తల్లి దగ్గరకు వస్తూ పోతూ ఉన్నాడు. అయితే సడన్‌గా ఇద్దరూ కనిపించకుండా పోయారు. వారి వ్యవహారంపై తనకు మొదటి నుంచి అనుమానం ఉన్నదని, ఇద్దరు పెండ్లి చేసుకున్నారని.. ఇంట్లో నుంచి రూ.20 వేలు ఎత్తుకుని పోయారని ఇంద్రరామ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino