గతంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీకి ఆ పార్టీకి చెందిన నేతలకు షాకిచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ” బీజేపీ పార్టీలో సామాన్య కార్యకర్త నుండి ప్రధానమంత్రి వరకు అందరూ ఓనర్లే అని సంచలన వ్యాఖ్యలు చేశారు అని తెలంగాణ పాలిటిక్స్ లో విన్పిస్తున్నాయి.
అంతే కాకుండా ఇంకో అడుగు ముందుకెసి అనవసరంగా బీజేపీ తరపున బరిలోకి దిగాను. అదే ఏ కాంగ్రెస్ పార్టీ తరపునో లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే మెజార్టీ ఇంకా ఎక్కువగా వచ్చేది అన్నట్లు కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.