తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ప్రధాని నరేంద్రమోడీకి లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన 8 ఏళ్లలో రాష్ట్రానికి ఇచ్చిందేంటో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పర్యటనో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రధాని విమర్శలు చేసిన నేపథ్యంలో హరీశ్‌రావు స్పందించారు. సిద్దిపేటలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ చేసింది గోరంత.. చెప్పేది కొండంత అని విమర్శించారు. ఇది గుజరాత్‌కాదని.. పోరాటాల గడ్డ తెలంగాణ అనే విషయాన్ని ప్రధాని మోడీ గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే టీఆర్‌ఎస్సే అని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.