Breaking News
Home / SLIDER / మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రూటే సెపరేటు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రూటే సెపరేటు

తెలంగాణ రాష్ట్ర  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రూటే సెపరేటు. మాస్‌కి మాస్‌ క్లాస్‌కి క్లాస్ అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రజల్లో ఇట్లే కలిసిపోతారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు. ఇదే తరహాలో పల్లె ప్రగతి కార్యక్రమాల్లో కూడా మంత్రి పల్లె ప్రజలతో మమేకం అవుతున్నారు.తాజాగా జిల్లాలోని రాయపర్తి మండలం కాట్రపల్లిలో పల్లె ప్రగతిలో పాల్గొనడానికి బుధవారం బయలు దేరారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం చీటూరు గ్రామం వద్ద రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ కూలీలు గుంటలు తీస్తున్నారు. వెంటనే తన వాహనం అపిన మంత్రి ఆ కూలీలతో కలిసి గుంటలు తీశారు.గడ్డపార వేసి, మట్టిని తవ్వారు. అలాగే కొద్దిసేపు కూలీలతో మాట్లాడారు. కూలీ ఎంత పడుతున్నది? పనులు సాగుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. అలాగే మంత్రి వారికి కుశల ప్రశ్నలు వేసి కూలీల్లో జోష్‌ నింపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino