Home / SLIDER / తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తేదీన‌ మొదలై మే 24 వరకు జరిగిన ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు ఈ రోజు మంగళవారం  రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా  విడుదలయ్యాయి. హైదరాబాద్ మహానగరంలోని  ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మంగళవారం ఉద‌యం 11 గంట‌ల‌కు మంత్రి సబితా ఫలితాలను విడుదల చేశారు.

. ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు ఇంటర్ రిజల్ట్స్‌ని మూడు ప్రభుత్వ వెబ్‌సైట్లలతో పాటు ‘నమస్తే తెలంగాణ’ www.ntnews.com వెబ్‌సైట్‌లోనూ చూసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.inresults.cgg.gov.inexamresults.ts.nic.inతోపాటు వీటిలో ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఇంటర్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే.. స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మార్క్‌ షీట్‌ను ప్రింట్‌ కూడా తీసుకోవచ్చు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat