Home / MOVIES / అభిమానులకు షాకిచ్చిన విజయ్ దేవరకొండ

అభిమానులకు షాకిచ్చిన విజయ్ దేవరకొండ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సృష్టించిన ‘అర్జున్ రెడ్డి’  సినిమాతో   రౌడీ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ .ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో  రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ . ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనేది దీనికి ట్యాగ్ లైన్.  ఈ చిత్రం  పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రెడీ అవుతున్న ఈ మూవీ నుంచి తాజాగా హీరో విజయ్ దేవరకొండకి సంబంధించిన షాకింగ్ పోస్టర్‌ను వదిలారు. అయితే  బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే  ఈ సినిమాతో సౌత్‌లో అడుగుపెడుతోంది.

మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో రూపొందుతున్న ‘లైగర్’ సినిమాలో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్‌  కీలక పాత్రలో కనిపించబోతున్నారు. పూరి – ఛార్మీ – కరణ్ జొహార్ నిర్మాతలు. దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్‌తో లైగర్ రూపొందుతుండగా వచ్చే ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ చేయనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా దాదాపు పూర్తైందని సమాచారం.

ఈ నేపథ్యంలో మేకర్స్ ‘లైగర్’ మూవీ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టారు. దీనిలో భాగంగా ఇప్పుడు విజయ్ కు సంబంధించిన ఓ బోల్డ్ పోస్టర్ రిలీజైంది. ఈ పోస్టర్ చూసిన ఆడియన్స్ షాకవుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా విజయ్ ఒంటిపై ఏమీ లేకుండా గులాబీలు మాత్రమే పట్టుకొని నిలుచున్న పోస్టర్‌ను వదలగా, అది ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

 

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar