Home / NATIONAL / రాష్ట్రపతి పదవి విరమణ తర్వాత రామ్‌నాథ్ కోవింద్ కు ఏమి ఏమిస్తారో తెలుసా..?

రాష్ట్రపతి పదవి విరమణ తర్వాత రామ్‌నాథ్ కోవింద్ కు ఏమి ఏమిస్తారో తెలుసా..?

ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ నెల 25న ముగియనుంది. ఈ నెల 24న ఆయనకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు హాజరుకానున్నారు. ఈ నెల 25న రాష్ట్రపతి భవన్ ఖాళీ చేయాల్సి ఉన్నా రెండ్రోజుల ముందే ఆయన తన ఇంటి సామాను 12 జన్‌పథ్ బంగ్లాకు తరలించాలని నిర్ణయించారు. ఇదే బంగ్లాలో రెండు దశాబ్దాలకు పైగా రామ్ విలాస్ పాశ్వాన్ ఉన్నారు. ఆయన మరణం తర్వాత ఈ బంగ్లా ఖాళీగా ఉంది. ఇటీవలే రామ్‌నాధ్ కోవింద్ కుమార్తె స్వాతి కోవింద్ బంగ్లాలో తమకు అనుకూలంగా మార్పులు, చేర్పులు చేయించుకున్నారు. ఈ బంగ్లా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసానికి పక్కనే ఉంటుంది.రిటైర్‌‌మెంట్ తర్వాత కోవింద్‌కు నెలకు లక్షన్నర పెన్షన్ ఇస్తారు. సిబ్బంది కోసం నెలకు 60 వేల రూపాయలు అదనంగా ఇస్తారు. బంగ్లాకు రెంట్ ఉండదు. కరెంట్, మొబైల్, ల్యాండ్‌లైన్ ఫోన్, ఇంటర్‌నెట్, నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. కారుతోపాటు డ్రైవర్‌ను కూడా ఇస్తారు.ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు ఉచితంవిమాన, రైలు ప్రయాణాలు ఉచితం. రాష్ట్రపతితో పాటు మరొకరికి ప్రయాణం ఉచితం. ఐదుగురు సిబ్బందిని కేటాయిస్తారు. అన్ని వసతులున్న వాహనం కూడా అందుబాటులో ఉంచుతారు. ఇద్దరు సెక్రటరీలు అందుబాటులో ఉంటారు. ఢిల్లీ పోలీసులు రక్షణ కల్పిస్తారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri