Home / SLIDER / టీఎస్‌పీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్‌

టీఎస్‌పీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్‌

తెలంగాణ రాష్ట్రంలో సర్కారు కొలువులకై ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. తాజాగా  టీఎస్‌పీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర రవాణాశాఖలో 113 అసిస్టెంట్‌ మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్‌ జారీచేసింది.

ఇందులో 54 పోస్టులు మల్టీ జోన్‌-1లో ఉండగా, 59 పోస్టులు మల్టీ జోన్‌-2 పరిధిలో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు నెల రోజుల పాటు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అభ్యర్థులకు నవంబర్‌లో రాత పరీక్ష నిర్వహించనున్నారు.

దీనిని ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాలను హెచ్‌ఎండీఏ పరిధిలోని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్టు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్‌ తెలిపారు. పూర్తి వివరాలకు www.tspsc. gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino