Breaking News
Home / LIFE STYLE / ప్రెగ్నెన్సీ సమయంలో ఈ టిప్స్ క‌చ్చితంగా పాటించాలి

ప్రెగ్నెన్సీ సమయంలో ఈ టిప్స్ క‌చ్చితంగా పాటించాలి

సహజంగా మహిళలకు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతాయని మనకు తెల్సిందే. ఈ క్రమంలో  అండం పిండంగా మారే దశ నుంచి బిడ్డ పుట్టేంతవరకూ శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. వాంతులు, వికారం, మలబద్ధకం, గుండెల్లో మంట, నడుం నొప్పితోపాటు కాలేయ సంబంధ రుగ్మతలు కూడా ఇబ్బంది పెడతాయి. వీటిని అధిగమించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

› గర్భిణులను ఎక్కువగా వేధించే సమస్య అజీర్ణం. కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినాలి. తొందరపాటు లేకుండా, నిదానంగా నమిలి మింగాలి.

› రాత్రి పడుకునే సమయానికి రెండు గంటల ముందే భోజనం అయిపోవాలి. అలసట తీరేందుకు వీలైనంత ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలి.

›  గర్భంలో బిడ్డకు మరింత చోటు సమకూర్చడానికి శరీరం కండరాల్ని సడలించడం వల్ల వెన్ను నొప్పులు వస్తుంటాయి. గర్భస్థ శిశువు పెరిగే కొద్దీ మూత్రాశయం మీద ఒత్తిడి అధికం
అవుతుంది. కాబట్టి, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాలి.

› మడమలు, కాళ్లకు శక్తినిచ్చే వ్యాయామాల వల్ల రక్త సరఫరా మెరుగుపడి తిమ్మిర్లు తగ్గుతాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా మలబద్ధకాన్ని నివారించవచ్చు.

› వీలైనంత ఎక్కువ నీళ్లు తాగడం వల్ల తలనొప్పి, గుండెలో మంట తదితర సమస్యలు తగ్గుతాయి. నూనెలు ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు. పాలు, పండ్లు, కూరగాయలతో కూడిన పోషకాహారాన్నే ఎంచుకోవాలి. ముఖ్యంగా వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులూ వేసుకోకూడదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino