వైఎస్ఆర్డీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళసైను కలవనున్నారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆమె ఈ సందర్భంగా ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి సోమవారం పాదయాత్ర ప్రారంభించాలని వైఎస్ షర్మిల భావించినప్పటికీ గవర్నర్ ను కలుస్తున్న దృష్ట్యా మంగళవారానికి వాయిదా వేసుకున్నారు.
