తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అమోదించారు. దీంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమైంది.. త్వరలో జరిగే మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలుస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు R.S.ప్రవీణ్ కుమార్ తెలిపారు. తమ పార్టీ అభ్యర్థిని మునుగోడు ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయిలో తమ పార్టీ తరపున అభ్యర్థులను బరిలో నిలబెడతామని ప్రకటించారు.
