టాలీవుడ్లోకి రావాలని తనకు ఎప్పటి నుంచో ఉందని, లైగర్ మూవీతో తన కోరిక నెరవేరుతోందని హీరోయిన్ అనన్య పాండే తెలిపింది. తెలుగు ప్రేక్షకులంటే ఎంతో ఇష్టమని ఈ అమ్మడు పేర్కొంది. ‘ఆగస్టు 25న బాక్సాఫీస్ పగిలిపోద్ది. పక్కా మాస్ కమర్షియల్ మూవీని దింపుతున్నాం. విజయ్ నా బుజ్జి కన్నా’ అంటూ పొగిడింది.. ఇక తన సినిమాకు సంబంధించి ఈవెంట్ చేయాలంటే వరంగల్్క తొలి ప్రాధాన్యం ఇస్తానని లైగర్ ప్రొడ్యూసర్ ఛార్మి వెల్లడించింది.పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
