తెలంగాణ రాష్ట్రంలో కొత్త లబ్ధిదారులకు నేటి నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. స్వతంత్ర భారత వత్రోత్సవాల్లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈరోజు స్వయంగా అర్హులకు అందజేస్తారు. దివ్యాంగులకు రూ. 3,016, ఇతరులకు రూ.2,016 ఇవ్వనున్నారు. పంపిణీ కార్యక్రమం ఈనెలాఖరు వరకు కొనసాగుతుంది. పింఛన్ల అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ CM KCR నిర్ణయం తీసుకోవడంతో కొత్తగా 9,46,117 మందికి పింఛన్ అందనుంది.
