పాన్ ఇండియా స్టార్ హీరో ..యంగ్ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త ఇది. వరుస ఫెయిల్యూర్స్ తో ఇండస్ట్రీలో విజయాలు లేక నిరాశలో ఉన్న ప్రభాస్ కథానాయకుడిగా హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మారుతీ దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతున్న సంగతి అందరికి తెల్సిందే.
అయితే ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలతో ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకుంది. నవంబర్ నెల నుండి ఈ చిత్రం షూటింగ్ పనులు సెట్ పైకి వెళ్లనున్నాయి.అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్న వార్తల ప్రకారం హారర్ కామెడీ కథాంశంతో ఈ మూవీని తీస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రభాస్ తన సినిమా కేరీర్ లోనే తొలిసారిగా ఈ జానర్ లో నటించడం విశేషం.కథానుగుణంగా ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లతో పాటు బాలీవుడ్ కు చెందిన బొమన్ ఇరానీ దెయ్యంగా నటించనున్నారు. ఈ చిత్రం హిట్ అయితే డార్లింగ్ అభిమానులకు శుభవార్తనే కదా. చూడాలి మరి ఈ మూవీ ఎంతవరకు విజయాన్ని అందిస్తుందో..?