Home / MOVIES / నా ఆనందానికి కారణం ఆ హీరోలు- రష్మికా సంచలన వ్యాఖ్యలు

నా ఆనందానికి కారణం ఆ హీరోలు- రష్మికా సంచలన వ్యాఖ్యలు

ఛలో మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చి వరుస సినిమాలతో పాటు వరుస హిట్లతో యువతకు నేషనల్ క్రష్ గా మారిన స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నా. స్టార్ హీరో.. ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు.. రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాలు హిట్లు సాధించడంతో ఈ ముద్దుగుమ్మ దూకుడుకు అడ్దు అదుపు లేకుండా పోయింది. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ పాన్ ఇండియా లెవల్ లో ఘన విజయం సాధించింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప-2 షూటింగ్ చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రం త్వరలొనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోవైపు బిగ్ బితో నటించిన గుడ్‌బై  విడుదల కానున్నది.

అయితే ఈ చిత్రానికి సంబంధించి తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ వదిలారు. ఎంతో ఆసక్తిగా సాగిన ఈ ట్రైలర్ చూస్తుంటే హిందీలో మొదటి హిట్ అందుకుంటుందనే నమ్మకం కలుగుతోంది. ఇక ట్రైలర్ రిలీజ్ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. అటు అమితాబ్ బచ్చన్‌తో నటించిన సినిమా రిలీజ్ కాబోతుండటం..ఇటు అల్లు అర్జున్‌తో నటించబోతున్న పుష్ప సీక్వెల్ సెట్స్‌పైకి రాబోతుండటం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం నేను గాలో తేలిపోతున్నట్టుగా అనిపిస్తుంది..దీనికి కారణం అమితాబ్, అల్లు అర్జున్ అని చెప్పింది  . 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino