Home / MOVIES / మెగా అభిమానులకు శుభవార్త

మెగా అభిమానులకు శుభవార్త

సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్  చిరంజీవి తాజాగా  తన 154వ సినిమాలో నటిస్తున్నారు.ఈ మూవీని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అయిన  మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై బాబీ దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. జీకే మోహన్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హాటెస్ట్ హీరోయిన్.. అందాల రాక్షసి అయిన శృతి హాసన్‌ నాయికగా  ఇతర పాత్రల్లో రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు కనిపించనున్నారు.

మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్‌ చిత్రీకరణలో ఉంది.తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్‌డేట్‌ చక్కర్లు కొడుతున్నది. ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ విడుదల తేదీని ఖరారు చేసుకుందట. వచ్చే ఏడాది జనవరి 13న చిరంజీవి 154వ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందని సమాచారం.

దీన్ని చిత్రబృందం ఖరారు చేయాల్సి ఉంది. ఆర్థర్‌ ఏ విల్సన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి మరో కొత్త సినిమా ‘గాడ్‌ఫాదర్‌’ నుంచి సల్మాన్‌, చిరు చిందేసిన ‘తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌’ లిరికల్‌ పాట ప్రోమో విడుదలై సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నది.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar