ఏపీ ముఖ్యమంత్రిగా మరో ఇరవై ఐదేండ్లు ప్రస్తుత అధికార వైసీపీ పార్టీ అధినేత ..తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారు అని మంత్రి మంత్రి జోగి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటి వరకు పని చేసిన ఏ ముఖ్యమంత్రి కూడా ఒక్క బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లోకి రూ.1,70,000 కోట్లు జమ చేయలేదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, చేయూత, విద్యా కానుక, రైతు భరోసా లాంటి 30 సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని మంత్రి జోగి రమేష్ తెలిపారు.
