ప్రముఖ సినీ నటుడు.. దివంగత మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడైన నందమూరి తారకరామరావు కష్టంతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ఆ కుటుంబానికి ప్రస్తుత ఆ పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అప్పగించడం లేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల తాను ఎన్నోసార్లు బాధ పడ్డానని దివంగత నందమూరి తారకరామారావు చెప్పారన్నారు. హెల్త్ వర్శిటీ పేరు మార్పుపై తెలుగు దేశం పార్టీకి చెందిన నేతలు అనవసర రాద్దాంతం చేస్తోందని మంత్రి కాకాణి విమర్శించారు. చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పంలో ఆయన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని.. ఆయన ఇక అసెంబ్లీ గడప కూడా తొక్కలేరని మంత్రి కాకాణి వ్యాఖ్యానించారు.