ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసులో టీడీపీకి చెందిన నేత.. ఆ రాష్ట్ర మాజీమంత్రి నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేసి కోర్టుకు తరలించిన సంగతి విదితమే. అయితే న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది.
దీంతో కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది చిత్తూరు కోర్టులో మరో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నారాయణ బెయిల్ రద్దు చేస్తూ నవంబర్ 30వ తేదీ లోపల పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.దీంతో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ కు చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టులో చుక్కెదురైనట్లు ఉంది.