దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారుల ఆర్థిక పురోగతి కోసం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు.వర్దన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామ చెరువులో ప్రభుత్వం 100శాతం సబ్సిడీతో అందిస్తున్న 1లక్షా 76వేల చేప పిల్లలను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు వదిలారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో చేపల పంపిణీ కార్యక్రమం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని తెలిపారు.
గొల్ల, కుర్మలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గొర్రెలను పంపిణీ చేసిన ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. మత్స్యకారులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి భరోసాను కల్పించిందని, చేపల పెంపకాన్ని వదిలి ఏదో ఒక కూలీ పని చేస్తూ బతుకునీడుస్తున్న మత్స్యకారుల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ గారు తిరిగి వెలుగులు నింపారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.