తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంకు చెందిన షేక్ ఖాజా భీ మృతి చెందిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి తక్షణ సహాయం క్రింద 5 వేల రూపాయల నగదును అందజేశారు.
అనంతరం గణేశ్వరం గ్రామానికి చెందిన కొర్రా సోమ్ల ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో వారి దశదిన కార్యక్రమానికి హాజరై రూ.5 వేల రూపాయల నగదును మంత్రి వ్యక్తిగత సహాయకులు చిరుమామిళ్ల రవికిరణ్ ఆయా కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కుర్ర భాస్కర్ రావు,మండదపు నరసింహరావు,సర్పంచ్ మెంటెం రామారావు,కోమరయ్య,నాగేశ్వరరావు,రమేష్ మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.