Home / SLIDER / కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం

కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం

 తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు పాల్గొని మాట్లాడుతూ….. రోగులకు అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తుందని ఆయన అన్నారు.

ఆసుపత్రికి సంబందించిన చేయాల్సిన అభివృద్ది పనులు రోగులకు ఉపయోగపడే అన్నీ సౌకర్యాలుకొరకు అన్నీ అనుమతులు మంజూర్ చేస్తున్నానని చెప్పినారు. ఆసుపత్రి సెన్సెస్ కూడా గత ఆరునెలల నుండి మెరుగుపడ్డాయని అభినందించారు. ఆసుపత్రి కి వచ్చు వారికి సిబ్బంది అందరూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ముఖ్యమైన పనులైన సెప్టిక్ టాంక్ నిండి మరుగుదొడ్లు నిరుపయోగముగా ఉన్నందున వెంటనే ఆ పనులు చేయించాలని,పనిచేయకుండా ఉన్న జనరేటర్ ని కూడా మరమత్తులు చేయించాలని సూచించారు.

ఈ సందర్బముగా ఇటీవల అందుబాటులోకి వచ్చిన త్రాగునీరు ప్లాంట్ ని అలాగే ఆసుపత్రి మొత్తం నూతన ఎలక్ట్రిక్ వైరింగ్ , పోస్టుమోర్టెమ్ రూమ్ రెనోవేషన్ అటెండన్స్ షెడ్ , రక్త నిల్వ కేంద్రము, పార్కింగ్ షెడ్ తదితర అభివృద్ది పనులు పరిశీలించి అవి త్వరలో అందుబాటు లోకి వస్తాయని తెలిపినారు. ఆసుపత్రి లో అందుబాటులో ఉన్న స్కానింగ్, డిజిటల్ ఎక్స్ రే , ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ సేవలు, లాబ్ టెస్ట్ లు అన్నీ ఎమర్జెన్సీసేవలు ముఖ్యముగా ఆర్థోపెడిక్ & డెలివరి సేవలు 24*7 కోదాడ నియోజకవర్గ ప్రజలు ఈ సేవలని వినియోగించుకోగలరని తెలియచేసారు.ఈ సర్వసభ్య సమావేశములు లో అభివృద్ది కమిటీ సభ్యులు ఎంపీపీ చింతా కవిత రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, పబ్బా గీతా, కన్వీనర్, ఇంచార్జీ సూపరింటెండెంట్ డా: ఎన్.రజని , మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, డా.కరుణ్,డా.ఏం.విజయ్ ,డా.కె.సురేశ్, టిఆర్ఎస్ నాయకులు వెంపటి మధుసూదన్, చందు నాగేశ్వరరావు, పాల్గొన్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat