ప్రస్తుత ఆధునీక యుగంలో బిజీబిజీ జీవిన శైలీలో చాలా మంది శ్వాసకోశ వ్యాధుల (యూఆర్‌టీఐ)తో బాధపడుతున్న సంగతి విదితమే. అయితే ఇలాంటి వారికి నిజంగా ఇది శుభవార్త. వైద్య చరిత్రలోనే అత్యంత దీర్ఘకాలిక వ్యాధులను ఆయుర్వేద డ్రగ్ ఫిఫట్రాల్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నదని తాజాగా పరిశోధకులు గుర్తించారు.
మొత్తం 203 మంది యూఆర్‌టీఐ రోగులకు రోజుకు రెండుసార్లు ఫిఫట్రాల్ డ్రగ్‌ను ఇచ్చారు. డ్రగ్ ఇచ్చిన మొదటి, నాలుగు, ఏడో రోజున వారికి వైద్యపరీక్షలు నిర్వహించారు.ఏడు రోజుల తర్వాత వారి పరిస్థితి 90.36 శాతం మెరుగుపడినట్టు పరిశోధకులు గుర్తించారు. ఇందులోని ఆయుర్వేద మూలకాల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి శ్వాసకోశ వ్యాధులు తగ్గుతున్నట్టు కనుగొన్నారు. ఈ అధ్యయన ఫలితాలు ‘ఆయుర్వేద అండ్ యోగా’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.