ఆంధ్రప్రదేశ్ బీజేపీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర నాయకత్వం సరిగా లేనందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఆయనకు మద్దతుగా పలువురు ముఖ్య నాయకులు కూడా కమలం పార్టీని వీడారు.
