సహాజంగా మహిళలు గర్భంతో ఉన్నప్పుడు సరైన ఫుడ్ తీసుకోవాలి. అది తీసుకోవద్దు. ఇది తీసుకోవాలి. ఎందుకంటే గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని హెల్త్ టిప్స్ సూచనలు పాటించాలని వైద్యులు సూచిస్తారు. ఇది అందరికి తెల్సిన విషయం.
అయితే మహిళలు గర్భంతో ఉన్నప్పుడు మద్యం సేవించడం వల్ల గర్భంలోని పిండానికి ఫీటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్ (FASD) తలెత్తవచ్చని నెదర్లాండ్స్ సైంటిస్టులు వెల్లడించారు.
దీనివల్ల శిశువుల ముఖాకృతుల్లో తేడాలు రావొచ్చని తెలిపారు. వారిలో ఎదుగుదల తగ్గడం, నాడీ సంబంధ సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీపీ లెర్నింగ్ టెక్నాలజీల సాయంతో వారు పరిశోధన చేశారు.