Home / SLIDER / ఆర్సీబీ కెప్టెన్ గా స్మృతి మంధాన

ఆర్సీబీ కెప్టెన్ గా స్మృతి మంధాన

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా టీమ్‌ కెప్టెన్‌గా టీమిండియా విమెన్ క్రికెట్ జట్టుకు చెందిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్ విమెన్ ..స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన ఎంపికయినట్లు ఆర్సీబీ యజమాన్యం ప్రకటించింది.. ఈ ఏడాది నుంచి కొత్తగా విమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) మొదలు కానున్నది.

దీనికోసం జరిగిన  వేలంలో స్మృతి మంధాన అత్యధికంగా రూ.3.40 కోట్ల ధర పలికింది. ఆర్సీబీ ఫ్రాంచైజీ వేలంలో ఆమెను దక్కించుకుంది.ఈ క్రమంలో ఆర్సీబీ.. స్మృతి మంధానాను తమ జట్టు కెప్టెన్‌గా ఎన్నుకుంది. ‘మా టీమ్‌లో స్మృతి మంధాన చాలా ముఖ్యమైన ప్లేయర్‌. అందుకే తాము ఆమెకు జట్టు నాయకత్వ బాధ్యతలను అప్పగించాం. స్మృతి ఆర్సీబీని ఉన్నత శిఖరాలను తీసుకెళ్తుందని బలంగా విశ్వసిస్తున్నాం’ అని ఆర్సీబీ చైర్మన్‌ ప్రత్మేశ్‌ మిశ్రా   ఈ సందర్భంగా ప్రకటించారు.

తనను ఆర్సీబీ కెప్టెన్ గా ప్రకటించిన నేపథ్యంలో స్మృతి మంధాన మాట్లాడుతూ.. ‘ఆర్సీబీ కెప్టెన్‌గా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆర్సీబీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. విరాట్‌ కోహ్లీ, ఫాఫ్‌ డూప్లిసిస్‌ ఆర్సీబీని అద్భుతంగా లీడ్‌ చేశారు. నేను కూడా అభిమానుల ప్రోత్సాహంతో డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ జట్టును విజయవంతంగా నడిపేందుకు 100 శాతం కృషి చేస్తా’ అని ఆమె చెప్పింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino