టీమిండియా మాజీ కెప్టెన్.. బీసీసీఐ అధ్యక్షుడు.. స్టార్ క్రికెటర్.. లెజండ్రీ సౌరవ్ గంగూలీ బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రంలో గంగూలీ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించబోతున్నారు.
ఈ విషయాన్ని గంగూలీ స్వయంగా వెల్లడించినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. గత నాలుగేండ్లుగా ఈ క్రికెటర్ బయోపిక్ గురించి చర్చలు జరుగుతున్నాయి. పాండమిక్ వల్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు ఆలస్యమవుతూ వచ్చింది.
ఇక ఈ పనులు వేగవంతం చేశారు.బ్యాట్స్‌మన్‌గా ప్రతిభ చూపించడంతో పాటు భారత క్రికెట్ జట్టులో దూకుడు తీసుకురావడంలో సారథిగా గంగూలీ విజయవంతమయ్యాడు. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది ఇంకా తేలలేదు. ఇతర నటీనటులను త్వరలో ప్రకటించనున్నారు. రణబీర్ కపూర్ తాజా సినిమా ‘తు జూతీ మై మక్కర్’ మార్చి 8న విడుదలకు సిద్ధమవుతున్నది. ఆయన ఖాతాలో ‘యానిమల్’ అనే మరో సినిమా ఉంది.