కర్ణాటక రాష్ట్ర బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు దొరికిపోయారు. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా ప్రశాంత్ పనిచేస్తున్నారు.
కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడు ఛైర్మన్ గా ఉన్న తన తండ్రికి బదులుగా ఓ కాంట్రాక్టర్ నుంచి ఇతను లంచం తీసుకున్నాడని అధికారులు తెలిపారు. సోదాల్లో రూ.1.70 కోట్ల నగదును గుర్తించామన్నారు.