ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డ్ సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్ లో 300 క్యాచ్ లు అందుకున్న రెండో భారత క్రికెటర్ గా కోహ్లి ఘనత అందుకున్నారు.
తొలి ఇన్సింగ్స్ లో ఆసీస్ బ్యాటర్ నాథన్ లియాన్ క్యాచ్ అందుకొని ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ 334 క్యాచ్‌లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.