ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతుండగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన శాసనసభ్యులు అడ్డుతగులుతున్నారు.
తాను బడ్జెట్ ప్రవేశపెడుతుండగా టీడీపీ సభ్యులు అడ్డుతగులుతుండటంతో ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ టీడీపీ సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, ఏలూరి సాంబశివరావు, బాలకృష్ణ, అశోక్ తదితర టీడీపీ సభ్యులను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.