ఏపీలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. నియోజకవర్గంలోని తన నివాసంలో ఉండగా గుండెనొప్పి రావడంతో వైద్యులను పిలిపించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు.. అయితే మరింత మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలలో కూడా గుండెలోని వాల్వ్ బ్లాక్ కావడంతో చికిత్స అందించారు.