ఏపీ ముఖ్యమంత్రి .. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఆ పార్టీకి చెందిన నేత.. ఆదోని అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఇంకా అనుభవం రాలేదని చెప్పారు. మరో ఐదేళ్లు అవకాశం ఇస్తే అనుభవం వస్తుందని ఆయన చెబుతున్నారు.
వైసీపీ అధిష్టానంపై నేతలు, కార్యకర్తలకు అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ అంగీకరించారు. ఎమ్మెల్యేలను ఎలా డీల్ చేయాలో ఒక పార్టీ అధినేతగా.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కు తెలియడం లేదని తెలిపారు.