గురువారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ విజయం ఐపీఎల్ చరిత్రలొనే అతిపెద్ద విజయంగా చరిత్రకెక్కింది.
కేకేఆర్ నిర్ణయించిన నూట యాబై పరుగుల లక్ష్యాన్ని ఆర్ఆర్ కేవలం ఒక్కటంటే ఒక్క వికెట్ ను మాత్రమే కోల్పోయి నలబై ఒకటి బంతులు మిగిలి ఉండగా గెలుపు తీరాలను చేరింది.
ఐపీఎల్ లో 150 అంతకన్నా ఎక్కువ లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన రెండో జట్టు RR నిలిచింది. తొలి స్థానంలో డెక్కన్ చార్జర్స్ ఉంది. 2008లో ముంబై ఇండియన్స్ పై 48 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను అందుకుంది.