కర్ణాటక అసెంబ్లీ ఫలితాల ఆరంభ ట్రెండ్స్ బీజేపీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. సీఎం బసవరాజ్ బొమ్మై ఆధిక్యంలో ఉన్నారు.. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలోని 8 మంది మంత్రులు వెనకంజలో ఉన్నట్లు కర్ణాటక నుంచి అప్డేట్ వస్తోంది. కమీషన్లలో మితిమీరిన మంత్రుల అవినీతి, క్షేత్రస్థాయిలో పనితీరు, నాయకత్వ లోపం వంటివి దీనికి కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు
