Home / ANDHRAPRADESH / ఎన్టీఆర్ జ్ఞాపకాలను చెరిపేస్తున్నారు..ఇదేనా మీ ప్రేమ…నందమూరి ఫ్యామిలీపై విఎస్ఆర్ ఫైర్..!

ఎన్టీఆర్ జ్ఞాపకాలను చెరిపేస్తున్నారు..ఇదేనా మీ ప్రేమ…నందమూరి ఫ్యామిలీపై విఎస్ఆర్ ఫైర్..!

ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో స్వర్గీయ ఎన్టీఆర్ ఫోటోతో 100 రూపాయల కాయిన్ ను రాష్ట్రపతి ముర్ము విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబసభ్యులు హాజరయ్యారు. కాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ ఈ కార్యక్రమానికి కర్త , క్రియగా వ్యవహించారని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ కాయిన్ ప్రోగ్రామ్ కు ఆయన సతీమణి లక్ష్మీ పార్వతితో పాటు, ఆయన అసలు సిసలైన వారసుడు జూ. ఎన్టీఆర్ కు ఆహ్వానం అందలేదని సమాచారం…ఇదే విషయమై లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబుతో పురంధేశ్వరీ కుమ్మక్కు అయి తనకు ఆహ్వానం అందకుండా చేసిందని తీవ్ర విమర్శలు చేశారు.

తాజాగా ఇదే విషయమై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. స్వర్గీయ ఎన్టీఆర్ జ్ఞాపకాలను చెరిపేస్తున్నారంటూ నందమూరి కుటుంబసభ్యులను ఏకిపారేసారు. ఎన్టీఆర్ ప్రేమతో చూసుకున్న ఆబిడ్స్ ఇల్లును విజయ్ ఎలక్ట్రికల్ రమేష్ కి కేవలం 4 కోట్లకు ఎందుకు అమ్ముకున్నారు…వీళ్ల దగ్గర 4 కోట్లు కూడా లేవా అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్ కు ఇష్టమైన ఆబిడ్స్ ఇల్లు రామక్రిష్ణకు వాటాగా వచ్చింది..ఆయన అమ్ముకుంటే.. కనీసం చంద్రబాబు లేక పురందేశ్వరీ అయినా ఆ ఇంటిని కొని…ఎన్టీఆర్ జ్ఞాపకార్థంగా ఉంచవచ్చుగా..అప్పుడు ఎన్టీఆర్ పట్ల మీకున్న నిజమైన ప్రేమకు అద్దం పట్టేది కదా…అంటూ ట్విట్టర్ వేదికగా కడిగిపారేసారు.

ఈ సందర్భంగా మద్రాస్ లోని ఎన్టీఆర్ నివసించిన ఇంటి ప్రస్తుత దుస్థితికి సంబంధించిన వీడియోను విజయసాయిరెడ్డి అప్ లోడ్ చేశారు…మద్రాస్ లో ఎన్టీఆర్ నివసించిన ఇల్లు ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆ మహానటుడి మీద మీకున్న ప్రేమ ఏంటనేది తెలుస్తోంది..వాటాలు తేల్చుకోలేక ఆ ఇంటిని పాడుపెట్టేశారని విఎస్ఆర్ నందమూరి కుటుంబసభ్యులపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఇక బంజారాహిల్స్ లో ఆయన చివరి క్షణాల్లో గడిపిన ఇంటి నుంచి లక్ష్మీ పార్వతిని వెళ్లగొట్టి…ఆ ఇంటిని పడగొట్టి..అపార్ట్‌మెంట్ లు కట్టుకుని అద్దెలకు ఇచ్చారంటూ నందమూరి వారసుల తీరును తప్పుపట్టారు. దానికి ఎదురుగా ఉన్న మరో ఇంట్లో మ్యూజియం పెట్టాలని ఎన్టీఆర్ భావించారని, ఆయన ఆశయాన్ని గౌరవించి, దానిని మ్యూజియంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీకు లేదా..అంటూ నందమూరి కుటుంబాన్ని వీఎస్ఆర్ నిలదీశారు.

ఎన్టీఆర్ కు కేవలం ఒక్క సమాధి తప్పా..కనీసం స్మారకచిహ్నం లేకుండా చేసి..ఇప్పుడు రూ. 100 నాణెం అంటూ మురిసిపోతున్నారు..తండ్రిపై ప్రేమ గుండెలోతుల్లోంచి..అంతరంగంలోంచి రావాలే తప్పా..పేపర్లు, టీవీల్లో కాదు చెల్లెమ్మా అంటూ..విజయసాయిరెడ్డి పరోక్షంగా పురంధేశ్వరీకి చురకలు అంటించారు. మొత్తంగా తమ తండ్రి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు సహకరించి, ఆయన చావుకు పరోక్షంగా కారకులైన నందమూరి వారసులు ఇప్పుడు అదే చంద్రబాబుతో కలిసి ఎన్టీఆర్ నాణెం అంటూ మురిసిపోవడంపై నిజమైన నందమూరి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం  నందమూరి కుటుంబసభ్యులు ఎన్టీఆర్ జ్ఞాపకాలను చెరిపేస్తున్నారంటూ ఫోటోలు, వీడియోలతో సహా వివరిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat