Home / ANDHRAPRADESH / చంద్రబాబుకు షాక్..వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!

చంద్రబాబుకు షాక్..వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!

ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది…మరో కొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు దూకుడు పెంచాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలు, ఆయన తనయుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రతో, బాబుగారి దత్తపుత్రుడిగా ముద్రపడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు వారాహియాత్ర పేరుతో ఎన్ని విమర్శలు చేసినా…ఎంత రచ్చ చేసినా…ప్రజల్లో మాత్రం సీఎం జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి ఆదరణ తగ్గలేదని ఇటీవల జరిగిన పంచాయతీ ఉప ఎన్నికలు చెప్పాయి. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతుండడంతో వైసీపీ ప్రభుత్వానికి సానుకూల అంశం. జగన్ పై తీవ్ర వ్యతిరేకత అనేది తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్లు చంద్రబాబు అనుకుల పత్రికలు, కొన్ని గుల ఛానళ్లలో తప్పా..క్షేత్రస్థాయిలో పెద్దగా లేదని వైసీపీ వర్గాలు అంటున్నాయి..వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ దే అధికారమని జాతీయ సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు నాయకత్వం, లోకేష్ అసమర్థతపై విసుగెత్తిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు , కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై వైసీపీలో చేరుతున్నారు.

తాజాగా విజయనగరం జిల్లా రాజాంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, ఆయన తనయుడు డాక్టర్‌ తలే రాజేశ్‌ సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌‌సీపీలో చేరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వారు కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం సీఎం వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. గతంలో పాలకొండ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున రెండుసార్లు (1985, 1994) తలే భద్రయ్య గెలుపొందారు. అలాగే ఏపీపీఎస్సీ సభ్యు డిగా ఆరేళ్లపాటు పనిచేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బా రెడ్డి, విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ చిన్న శ్రీను, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు.

ఇక అనకాపల్లిలో కూడా కీలక టీడీపీ సీనియర్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు.. స్థానిక టీడీపీ నేత మలసాల భరత్‌ కుమార్, ఆయన తల్లిదండ్రులు రమణారావు (విశాఖ డెయిరీ డైరెక్టర్‌), ధనమ్మ (మాజీ ఎంపీపీ) వైఎస్సార్‌సీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ వారికి స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భరత్‌ కుమార్‌ కుటుంబంతోపాటు గంగుపాం నాగేశ్వరరావు (మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌), మల సాల కుమార్‌ రాజా (విశాఖ జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి) కూడా పార్టీలో చేరారు. మొత్తంగా ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలోకి వలసలు షురూ అవుతాయనకుంటే..రివర్స్ లో టీడీపీ నుంచి వలసలు మొదలవడంతో చంద్రబాబు, లోకేష్ లకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయినట్లైంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat