Home / SLIDER / తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్సే…కేసీఆర్ కు తిరుగులేదు..పీకే సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్సే…కేసీఆర్ కు తిరుగులేదు..పీకే సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య భీకర పోరు జరగనుంది..కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పుల్ జోష్ ఉంది..బీఆర్ఎస్ లో టికెట్ దక్కని కీలక నేతలకు గాలం వేస్తూ…కేసీఆర్ ను ఈసారి ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉంది..మరోవైపు బండి సంజయ్ నాయకత్వంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి బీఆర్ఎస్ కు సవాలు విసిరిన బీజేపీ ఇప్పుడు అధ్యక్ష మార్పుతో ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది.. బండి సంజయ్ ను తొలగించిన తర్వాత కాషాయ క్యాడర్ లో పూర్తిగా నిస్తేజం నెలకొంది. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ జోస్యం చెప్పారు.

తెలంగాణలో కొలువు దీరేది గులాబీ సర్కారేనని ఆయన కుండబద్ధలు కొట్టారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు తిరుగులేదని తేల్చిచెప్పారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, ఛత్తీస్‌గఢ్‌లో కాం గ్రెస్‌, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తాయని చెప్పారు. విపక్ష ఇండియా కూటమిని ముందుకు నడిపే సరైన నాయకుడు లేడని, రాహుల్‌కు ఆ సామర్థ్యం లేదని నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు. విద్యార్థులు పరీక్షల ముందు అరగంటసేపు పుస్తకం పట్టినట్టు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి కట్టారని కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి చురకలంటించారు.

తాను భవిష్యత్తులో ఏ పార్టీకి ఎన్నికల సమన్వయకర్తగా పనిచేయబోనని, తాను ఆ పని మానేశానని చెప్పారు. తన దృష్టి అంతా తన సొంత రాష్ట్రం బీహార్‌ అభివృద్ధిపైనే ఉన్నదని చెప్పారు. తాను బీహార్‌లో సరైన వ్యవస్థను ఏర్పాటు చేస్తానని, అక్కడి ప్రజల కోసమే పనిచేస్తానని తేల్చిచెప్పారు. కాగా ప్రశాంత్‌ కిశోర్‌ 2012 నుంచి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. 2012లో గుజరాత్‌ సీఎంగా నరేంద్రమోదీ వరుస విజయం సాధించడంతోపాటు 2014లో దేశప్రధానిగా అద్భుత విజయం సాధించడంలో కీలకంగా పనిచేశారు. బీహార్‌లో నితీశ్‌కుమార్‌ హ్యాట్రిక్‌ సీఎంగా గద్దెనెక్కడంలోనూ ఆయన కృషి ఉన్నది. అనంతరం పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా గద్దెనెక్కేందుకు కారణమయ్యారు. 2012 నుంచి ఇప్పటివరకూ ఒకటి రెండు చోట్ల తప్ప అన్ని ఎన్నికల్లో ఆయన చెప్పిన పార్టీలే విజయం సాధించడం విశేషం.

మొత్తంగా తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. పీకే వ్యాఖ్యలతో అధికార బీఆర్ఎస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొనగా, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు షాకింగ్ గా మారాయి.
పీకే కామెంట్స్ ను అంత తేలికగా కొట్టిపారేయాల్సిన విషయం కాదని, తెలంగాణలో ఇప్పటికీ బీఆర్ఎస్ కు ఎడ్జ్ ఉందని, కేసీఆర్ ను ఓడించాలంటే మరింత పకడ్బందీ వ్యూహాలతో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ సీనియర్లు అంటున్నారు. మరి తెలంగాణలో పీకే అంచనాలు నిజమవుతాయా…కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారా లేదా అనేది చూడాలి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat