40 ఏళ్లుగా ఎన్నో వేల కోట్ల స్కామ్‌లు చేసినా..వ్యవస్థలను అడ్డుపెట్టుకుని, చట్టాలు, న్యాయాల్లో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకుని ఒక్క కేసులో కూడా విచారణ ఎదుర్కొకుండా ఏకంగా 18 స్టేలు తెచ్చుకుని స్టేబిఎన్ గా పేరుగాంచిన స్కామ్ స్టర్…నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు 371 కోట్ల స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయి..రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం ప్రారంభించారు. అయితే జైలు అధికారులు చంద్రబాబుకు కేటాయించిన ఖైదీ నెంబర్ 7691 ని కూడితే 23 వస్తోంది..అలాగే చంద్రబాబును అరెస్ట్ చేసిన సెప్టెంబర్ 9 ని కూడితే 09+09+2+3 = 25 ) 23 వస్తోంది. దీంతో గత ఎన్నికల నుంచి చంద్రబాబును వెంటాడుతున్న 23 సెంటిమెంట్ జైలు జీవితంలో కూడా వెంటాడుతుందని సోషల్ మీడియాలో బాబుగారికి ఫుల్లుగా వేసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు పేరేత్తితే తనదైన శైలిలో సెటైర్లు, పంచ్ మార్క్ డైలాగులతో రెచ్చిపోయే వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తాజా అరెస్ట్ పై ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయారు. ‘చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691. 7+6+9+1 = 23. చంద్రబాబు గారూ…మీకు 2023 చివరి సంవత్సరం. 24 నుంచి రాజకీయ యవనికపై ఇక కనిపించరు. మీ మామగారు ఎంత మనోవేదన చెందారో ఇప్పుడు అర్ధం అయ్యుంటుంది మీకు’. అంటూ ట్వీట్ చేశారు.
ఇక చంద్రబాబును వెంటాడుతున్న 23 నంబర్‌ను గుర్తు చేస్తూనే 2024 నుండి రాజకీయ యవినికపై ఇక కనపించరు అంటూ ఎద్దేవా చేశారు. అలాగే గతంలో తన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన్ను ఏడిపించి.. మనోవేదనకు గురి చేసిన విషయాన్ని కూడా గుర్తుకు తెచ్చారు. ఇక చంద్రబాబు అరెస్ట్‌పై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. కాస్త ఆలస్యం అయితే అయ్యుండొచ్చు కానీ అరెస్ట్ మాత్రం పూర్తి ఆధారాలతో జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. జీవితాంతం జైల్ లో నే ఉండాల్సినన్ని నేరాలతోకూడిన స్కాం లు చేశారు చంద్రబాబు అండ్ కో. ఇక చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీ కి కూడా చట్టం వర్తిస్తుంది. ఇన్నాళ్లూ తప్పించుకోగలిగారు కానీ ఇక శిక్షా సమయం ఆసన్నమైంది అంటూ ట్వీట్టర్ వేదికగా రామోజీ రావుకు వార్నింగ్ ఇచ్చారు.
చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంపై కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. పక్కా ఆధారాలతో కేసులు పెట్టారు. ఈ ఒక్క స్కిల్ కేసే కాదు..చంద్రబాబుపై ప్రాసిక్యూటబుల్ కేసులు ఇంకా ఐదారు ఉన్నాయి..తన స్వార్థంతో చట్టం నుంచి తప్పించుకుంటూ వచ్చాడు..ఇకపై అలా జరగదు..చంద్రబాబు దోచుకున్న ధనాన్ని బయటకు తీస్తాం..చంద్రబాబుకు కచ్చితంగా ఈ కేసులో పది సంవత్సరాలు శిక్ష పడుతుందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు అరెస్టు తేదీ, ఖైదీ నంబర్‌పై 23 సెంటిమెంట్ ను గుర్తు చేస్తూ విజయసాయిరెడ్డి చేసిన సెటైరికల్ ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.