Home / ANDHRAPRADESH / టీడీపీ బంద్ విఫలం..చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచిన భార్యా, కోడలు..!

టీడీపీ బంద్ విఫలం..చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచిన భార్యా, కోడలు..!

స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబును కోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా సోమవారం టీడీపీ ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు జనసేన మద్దతు పలికింది..కానీ ఈ బంద్ కు సామాన్య ప్రజలెవరూ స్పందిచలేదు..చంద్రబాబు అరెస్ట్ అయితే భూగోళం ఏదో బద్ధలైనట్లుగా, ఆకాశం విరిగిపడినట్లుగా, సునామీ వచ్చి ప్రపంచం కొట్టుకుపోయినంతగా పచ్చ మీడియా గత నాలుగు రోజులుగా శోకాలు పెడుతూ.. టీడీపీ ఇక అంతం అయినట్లే అన్నట్లుగా చావు డప్పు కొడుతోంది..కానీ సామాన్య ప్రజలు మాత్రం చంద్రబాబు అరెస్ట్ ను దాదాపుగా సాధారణంగానే చూస్తున్నారు. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే అంటున్నారు..అందుకే టీడీపీ బంద్‌కు ప్రజల నుంచి పెద్దగా స్పందించలేదు..

సోమవారం యధావిధిగా…రోజువారీ కార్యక్రమాలు సాగిపోయాయి..ఉదయం కాసేపు టీడీపీ నేతలు, కార్యకర్తలు కాసేపు రోడ్ల మీదకు వచ్చి బంద్ చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చేసి..పచ్చ మీడియా ఛానళ్ల కెమెరాల ముందు ఓ మూడు నిమిషాలు వీరంగం వేసి ఇళ్లకు వెళ్లిపోయారు..ఇక ముఖ్యనేతలంతా స్వచ్చంధంగా హౌస్ అరెస్ట్ అయిపోయి..రోడ్ల మీదకు రాలేకపోతున్నామంటూ అచ్చెంకు కబురుపంపారు..పాపం అచ్చెం నాయుడు అధినేత సెంట్రల్ జైలులో చిప్పకూడు తింటే..మీరు ఇంట్లో బిర్యానీలు తిని పడుకున్నారా..ఇక పార్టీ లేదు..బొక్కా లేదు..బాబుగారితో సహా అంతా బొక్కలోకే అంటూ ఇడ్లీలో చట్నీ అద్దుకుని తింటూ తెగ వాపోయారు…

అయితే టీడీపీ బంద్ విఫలం అయిన బాధ కంటే..తమ బాబుగారికి సొంతింట్లోనే వెన్నుపోటు పొడిచిన వైనం తలుచుకుని తెగ బాధపడిపోతున్నారు ..సోమవారం టీడీపీ బంద్ చేసినా…చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ డెయిరీలు మాత్రం యధావిధిగా తెరుచుకున్నాయి..స్వయానా బాబుగారి సొంత ఇలాకా అయిన చిత్తూరు జిల్లాలో కూడా హెరిటేజ్ డెయిరీలు మూయలేదు..కనీసం టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా తమ అధినేతకు చెందిన హెరిటేజ్ డెయిరీ షాపులను బంద్ చేసే ధైర్యం చేయలేకపోయారు..స్వయానా చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉంటే..పార్టీ బంద్ కు పిలుపు ఇస్తే హెరిటేజ్ సంస్థలు యధావిధిగా నడవడంపై టీడీపీ కార్యకర్తలు..నారా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

హెరిటేజ్ డెయిరీకి స్వయానా చంద్రబాబు భార్య, కోడలు నారా భువనేశ్వరీ, నారా బ్రాహ్మణీ మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నారు.తమ భర్తని అక్రమంగా అరెస్ట్ చేసి, అన్యాయంగా జైల్లో పెట్టారని వాపోతున్న నారా భువనేశ్వరీ..తన భర్త అరెస్టుకు నిరసనగా పార్టీ బంద్ కు పిలుపునిస్తే..తన హెరిటేజ్ డెయిరీని మాత్రం బంద్ చేయకుండా తన వ్యాపారం తాను చేసుకున్నారు.ఇక మామగారి అరెస్ట్ నిరసనగా తన భర్త లోకేష్ రోడ్ల మీద కూర్చుని నిరసన తెలియజేస్తుంటే..నారా బ్రాహ్మణికి తన వ్యాపారమే ముఖ్యమైంది…ఇది కదా వెన్నుపోటు గురుకు అసలైన వెన్నుపోటు అంటే ఇదే..సొంతింటిలోనే చంద్రబాబును అరెస్ట్ చేశారన్న బాధ లేకుండా..భార్యా, కోడలు తమ పాల వ్యాపారం చేసుకున్నారంటూ..తెలుగు తమ్ముళ్లు తమలో తాము తెగ కుమిలిపోతున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat